- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
దొడ్డి కొమురయ్య గొప్ప విప్లవ వీరుడు, దొరల దౌర్జన్యాలను ఎదిరించిన తొలి తెలంగాణ అమరవీరుడు’ అని బీజేపీ సీనియర్ నేత, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

దిశ, వనస్థలిపురం : ‘దొడ్డి కొమురయ్య గొప్ప విప్లవ వీరుడు, దొరల దౌర్జన్యాలను ఎదిరించిన తొలి తెలంగాణ అమరవీరుడు’ అని బీజేపీ సీనియర్ నేత, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా.. మహనీయుల విగ్రహాల సమీపంలో ‘కురుమ యువ చైతన్య సమితి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమురయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు కాలిన మల్లేష్ అధ్యక్షతన జరిగిన సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. రజాకార్లు, దేశ్ముఖ్ల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురయ్య అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో బలహీన వర్గాల పాత్ర విశేషమని, అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగితేనే నిజమైన సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. కొమురయ్య స్ఫూర్తితో కురుమలు రాజకీయంగా చైతన్యం కావాలని పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కొమురయ్య స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిజాం పాలనను ఎదిరించి ప్రాణత్యాగం చేసిన వీరుడిగా ఆయనను గుర్తు చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కురుమ కులస్తులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేశ్ కురుమ మాట్లాడుతూ కురుమలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మధుయాష్కీ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేష్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, ఈశ్వరమ్మ యాదవ్, కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి పాల్గొన్నారు.






