భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద కొనసాగుతున్న వెండి నాణేల పంపిణీ

by Muthe.Rajitha |

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సందడి కొనసాగుతోంది.

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద కొనసాగుతున్న వెండి నాణేల పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్ : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సందడి కొనసాగుతోంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా దీపావళి మరుసటి రోజునుంచి ఆలయం వద్ద అమ్మవారి ప్రతిమ ఉన్న వెండి నాణేల పంపిణీ జరుగుతోంది. గత 3రోజుల నుంచి కొనసాగుతున్న అమ్మవారి ఖజానా పంపిణీ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి, అమ్మవారిని దర్శించుకొని వెండి నాణేలను తీసుకు వెళ్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని ఆలయ నిర్వాహకులు ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఆలయం తలుపులు తెరుచుకున్నప్పటి నుంచి రాత్రి వరకు క్యూ లైన్లు భారీగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నాణేలు తమ ఇళ్లలో ఉండటం వల్ల స్వయంగా అమ్మవారు తమ ఇంటికి వచ్చినట్టుగా, సిరి సంపదలు ఇంటికి వచ్చినట్టు భావిస్తారు భక్తులు. కాగా ఆలయం వద్ద ఎలాంటి తోపులాట జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు.

Next Story