- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ అరెస్టు చీటింగ్...ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగి పాత్ర
డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతూ... సైబర్ నేరాలకు బ్యాంక్ ఖాతాలను ఇస్తు సహాకరిస్తున్న కర్నాటకకు చెందిన ఓ

దిశ, సిటీక్రైం: డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతూ... సైబర్ నేరాలకు బ్యాంక్ ఖాతాలను ఇస్తు సహాకరిస్తున్న కర్నాటకకు చెందిన ఓ పైవేటు బ్యాంక్ ఉద్యోగిని బుధవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...జూలై 4వ తేదిన హైదరాబాద్ కు చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలికి గుర్తు తెలియని వ్యక్తి అంధేరీ ముంబాయి పోలీసు అధికారి ప్రదీప్ సావంత్ గా పరిచయం చేసుకుని వాట్సాప్ కాల్ చేశాడు. మనిలాండరింగ్ కేసులో మీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ ఉన్నట్లు తేలింది. కాబట్టీ మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో మీకు 3 నుంచి 11 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని భయపెట్టించారు.
అలా దాదాపు 6 గంటల పాటు వృద్ధురాలిని ఆందోళనకు గురి చేశారు. మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే..మీ బ్యాంక్ ఖాతాల వివరాలు చెప్పాలి, 15 లక్షల రూపాయాలను మా ఖాతాకు పంపిస్తే వాటిని తనిఖీ చేసుకుని తిరిగి 24 గంటల్లో పంపిస్తామని చెప్పారు. ఆ వృద్ధురాలికి నకిలీ సీబీఐ, ఆర్బీఐ, సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీలను పంపించి మరింత కలవరానికి గురి చేశారు. దీంతో వృద్ధురాలు 9 రోజులలో తన పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లను విత్ డ్రాచేసుకుని 9 రోజులలో మొత్తం 10 లక్షలను పంపించింది. తర్వాత ఇది మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం కర్నాటకకు చెందిన ప్రతాప్ కేసరి ప్రధాన్ లను అరెస్టు చేశారు.
కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ గా బ్యాంక్ ఖాతాలు సైబర్ క్రిమినల్స్ కు సప్లై--
కర్నాటకకు చెందిన ప్రతాప్ కేసరి ప్రధాన్ ఏయూ స్మాల్ బ్యాంక్ లో కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. బ్యాంక్ కు కస్టమర్ లను తీసుకువచ్చే క్రమంలో వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నాడు. దీని కోసం కస్టమర్ లకు కమీషన్ లను ఆశచూపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా ప్రతాప్ కేసరి ప్రధాన్ ఇచ్చిన ఖాతాల్లో డిజిటల్ అరెస్టు కు పాల్పడిన సైబర్ నేరగాళ్లు అమయాకుల డబ్బులను ఈ ఖాతాల్లో వేసుకుని ఆ తర్వాత వాటిని ఖాళీ చేస్తు కోట్లు కొట్టేశారని తేలింది. ఇలా సైబర్ క్రిమినల్స్ ఈ బ్యాంక్ ఖాతాల్లో దేశ వ్యాప్తంగా 7 డిజిటల్ అరెస్టు చీటింగ్ కేసుల ద్వారా కొల్లగొట్టిన నగదును బదిలీ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 2 మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






