- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ విధానాలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
బీజేపీ నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

బీజేపీ విధానాలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
– తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటంగా చెప్పడం సిగ్గుచేటు
– నియంతృత్వ బీజేపీకి ఓటుతోనే బుద్దిచెప్పాలి
– సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
దిశ, వనస్థలిపురం : బీజేపీ నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం మన్సూరాబాద్ డివిజన్‌లోని ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ‘వీర తెలంగాణ సాయుధ పోరాట వక్రీకరణలు – వాస్తవాలు’ సదస్సులో ఆయన మాట్లాడారు. “తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం సిగ్గుచేటు. నిజానికి ఆ పోరాటం పేదల కోసం, భూహక్కుల కోసం జరిగింది. ఆ పోరాటంలో వేలాది ఎకరాల భూములు పేదలకు పంచబడ్డాయి. 4 వేలమంది కమ్యూనిస్టులు తలలు వంచారు. అంతటి మహత్తర చరిత్రను బీజేపీ కించపరుస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “బీజేపీ ఆటలు సాగనివ్వకూడదు. ప్రతి ఒక్కరు తమ ఓటుతోనే ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి” అని తమ్మినేని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, చంద్రమోహన్, నర్సిరెడ్డి, ఎల్లయ్య, వెంకన్న, వీరయ్య, మల్లేశం, సంధ్య, రామస్వామి తదితర సీపీఎం నాయకులు పాల్గొన్నారు.






