- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : హైడ్రా తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు?
by Muthe.Rajitha |
హైడ్రా(HYDRAA) తీరుపై కొందరు విల్లా యజమానులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(HYDRAA) తీరుపై కొందరు విల్లా యజమానులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో(Hyderabad)ని బాచుపల్లిలో ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా ప్రహరీ గోడను కూల్చివేసింది. ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రహరీ గోడను కూల్చి వేయడంపై సుమారు 600 మంది విల్లాల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వారంతా సిద్ధమైనట్టు సమాచారం. HMDA ఆమోదం పొందిన సొసైటీలో ఇలా నిర్మాణాలు కూల్చడం ఏమిటని, ఇది చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై హైడ్రా అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన వెలువడలేదు.
Next Story






