సీఎం రేవంత్ రెడ్డి అత్తమ్మకు గుండెపోటు

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్త పారిజాతమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి అత్తమ్మకు గుండెపోటు
X

దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్త పారిజాతమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్‌ లో చేరారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్య బృందం అత్యవసరంగా సీపీఆర్, ఏసీఎల్‌ఎస్ నిర్వహించారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని, కరోనరీ యాంజియోగ్రామ్‌లో గుండెలో పెద్దగా అడ్డంకులు లేవని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె గుండె లయ, రక్తపోటు స్థిరంగా ఉన్నప్పటికి, పరిస్థితి సున్నితంగా ఉండటంతో ఐసీయూలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. రాబోయే 24 గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితి, ముఖ్యంగా న్యూరోలాజికల్ స్థితి అంచనాకు కీలకమని డాక్టర్లు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం ఉత్తమ చికిత్స అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులను అడిగి పారిజాతమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని మెడికవర్ వైద్యులకు సూచించారు.

Next Story