చింత‌ల‌కుంట రేడియో ట‌వ‌ర్ ఎక్కి వ్య‌క్తి హ‌ల్ చ‌ల్..!

by Nallavelli.Anjaneyulu |

ఎల్బీనగర్ లోని చింతల్‌కుంట ప్రాంతంలో రేడియో టవర్‌పైకి ఎక్కి శ‌నివారం ఓ వ్యక్తి హ‌ల్ చ‌ల్ చేశాడు.

చింత‌ల‌కుంట రేడియో ట‌వ‌ర్ ఎక్కి వ్య‌క్తి హ‌ల్ చ‌ల్..!
X

దిశ‌, వ‌న‌స్థ‌లిపురం : ఎల్బీనగర్ లోని చింతల్‌కుంట ప్రాంతంలో రేడియో టవర్‌పైకి ఎక్కి శ‌నివారం ఓ వ్యక్తి హ‌ల్ చ‌ల్ చేశాడు. ముఖ్యంగా జానీ బాబు అనే వ్యక్తి టవర్ ఎక్కి డయల్ 100కి ఫోన్ చేశాడు. ఆటో గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. తన ఆటోను కింద ఉంచి టవర్‌పైకి ఎక్కినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం పోలీసులు, హైడ్రా బృందం, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జానీ బాబు టవర్‌పై నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను కింద పడేసినట్లు తెలుస్తోంది. తన వద్ద మరో ఫోన్ ఉందని పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. పోలీసులు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వ్యక్తిని సురక్షితంగా కిందకు దింపారు.

Next Story