- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ చైన్ స్నాచర్ దొరికేసాడు.. వివరాలు వెల్లడించిన పోలీసులు
బంగారు గొలుసును దొంగిలించి పారిపోయిన నిందితున్ని మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి 14 గ్రాముల గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

దిశ, కార్వాన్ : బంగారు గొలుసును దొంగిలించి పారిపోయిన నిందితున్ని మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి 14 గ్రాముల గొలుసును స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం మెహిదీపట్నంలోని డీసీపీ కార్యాలయంలో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీచంద్ర మోహన్ వివరాలను వెల్లడించారు. ఆసిఫ్ నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ నజీబ్ (35) ల్యాబ్ టెక్నీషియన్. కాగా ఈ నెల 1న విజయ నగర్ కాలనిలో చంద్రకళ (65)అనే వృద్ధురాలు పాల ప్యాకెట్ కొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా వెనక నుండి వెంబడించి ఆమె మెడలో ఉన్న 2 తులాల గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించదంతో క్రింద పడేసి మరి గొలుసును లాకునే క్రమంలో గొలుసు తెగిపోయింది.
దీంతో మిగిలిన 1.4 గ్రాముల గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మల్లెపల్లి ఎక్స్ రోడ్డులో దొంగిలించిన గొలుసును అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకుని అతని వద్ద 1.4 గ్రాముల గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు ఆన్లైన్ బెట్టింగ్,గంజాయి కి అలవాటు పడి విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బులు లేక దొంగతనాలు చేసేందుకు పథకం వేశాడని విచారణలో ఒప్పుకున్నట్లు పోలిసులు తెలిపారు.
ఈ ఆపరేషన్ లో మెహదీపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ టీం, సౌత్-వెస్ట్ జోన్ డిసిపి చంద్ర మోహన్ , సౌత్-వెస్ట్ జోన్ అడిషనల్ డిసిపి ఇక్బాల్ సిద్దిక్, ఆసిఫ్ నగర్ ఏసిపి విజయ్ శ్రీనివాస్,మెహదీపట్నం ఎస్హెచ్ఓ ఎస్.ఎస్. మల్లేష్, జి. బాల కృష్ణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిఎస్ఐ అహ్మద్ పాషా, ఎస్ఐ కె. శ్రీనివాస రెడ్డి, రామ్ మనోహర్ , క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.






