మరోసారి సచివాలయంలో ఊడిన పెచ్చులు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-24 15:06:16  IST  )

తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో మరోసారి పెచ్చులు(ceiling collapse) విరిగిపడ్డ ఘటన చోటుచేసుకుంది.

మరోసారి సచివాలయంలో ఊడిన పెచ్చులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో మరోసారి పెచ్చులు(ceiling collapse) విరిగిపడ్డ ఘటన చోటుచేసుకుంది. దీనితో సచివాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా గ్రౌండ్ ఫ్లోర్ లోని రూం నంబర్ 28 వద్ద ఇది జరిగింది. ఈ ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వచ్చే మార్గంలో సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సచివాలయ నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. అయితే గతంలో కూడా రెండుసార్లు ఇలా పెచ్చులు ఊడగా... నిర్మాణ సంస్థ చర్యలు చేపట్టింది. కాగా నేడు జరిగిన సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గాని, ఎవరకైనా గాయాలు సంభవించినట్లు సమాచారం లేదు.

Next Story