'బీఆర్ఎస్ నేత‌లు రాబోయే ప‌దేళ్ల పాటు సీఎం రేవంత్ నామ‌స్మ‌ర‌ణ చేయాలి'

by Ratna Kumari |

రాబోయే పదేళ్ల పాటు బీఆర్ ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి నామస్మరణ చేయాల‌ని.. అప్పుడే మీ పాపాలు పోతాయని తెలంగాణ ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు.

బీఆర్ఎస్ నేత‌లు రాబోయే ప‌దేళ్ల పాటు సీఎం రేవంత్ నామ‌స్మ‌ర‌ణ చేయాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాబోయే పదేళ్ల పాటు బీఆర్ ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి నామస్మరణ చేయాల‌ని.. అప్పుడే మీ పాపాలు పోతాయని తెలంగాణ ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు అబద్దాలు రాస్తే రామకోటి, చెప్పుకుంటే భగవత్ గీత మాధిరిగా ఉంటుందని ఎద్ధేవా చేశారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసిందని, అలాంటి వారు రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి అని.. రాబోయే రోజులలో బీఆర్ఎస్ భవన్ లో నాటకాలు వేసుకోవచ్చని, ఒకవేళ రవీంద్రభారతి నిండిపోతే బీఆర్ఎస్ భవన్ సిద్ధంగా ఉందని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

Next Story