- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > భారీ భూకబ్జా డ్రామాకు బ్రేక్..! 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
భారీ భూకబ్జా డ్రామాకు బ్రేక్..! 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
by Ramesh Naini |
హైడ్రా చొరవతో భారీ భూ కబ్జా డ్రామాకు బ్రేక్ పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా చొరవతో భారీ భూ కబ్జా డ్రామాకు బ్రేక్ పడింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్ సర్వే నంబరు 191లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 750 కోట్లకు పైగా ఉంటుందని శుక్రవారం ఎక్స్ వేదికగా హైడ్రా తెలిపింది. ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతుందని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి విచారించిందని, ఆక్రమణలను నిర్ధారించుకున్నట్లు పేర్కొంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు శాశ్వత నివాసాల జోలికి వెళ్లకుండా.. మిగతా షెడ్డులను, ప్రహరీలను తొలగించి.. 10 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Next Story






