Eatala Rajender: కమలాపూర్ వెళ్దాం రా..?. సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్

by Disha Web Desk 16 |
Eatala Rajender: కమలాపూర్ వెళ్దాం రా..?. సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: మూడు నెలల్లో కేసీఆర్ సర్కార్ పతనమవుతుందని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సీఎం కేసీఆర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తన ఇంటికి 50 మంది పోలీసులను పంపించారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంవల్లే కొన్ని డబుల్ బెడ్ ఇళ్లు నిర్మాణ దశలోనే ఆగిపోయాయన్నారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఈటల విమర్శించారు. డబ్బులకు కొదవలేకపోతే ఎందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నారని ఈటల ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కమలాపుర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ హామీపై సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులే నిర్మించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కమలాపూర్ వస్తే ఏం జరుగుతుందో దగ్గర ఉండి చూపిస్తానని ఈటల రాజేందర్ చాలెంజ్ చేశారు.

Read More : బీఆర్ఎస్‌లో నెంబర్ 2 ఎవరు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కొత్త టెన్షన్


Next Story