- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ, ఎల్బీనగర్: రెండేళ్ల పసిపాపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన దారుణ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా రెడ్డిగూడానికి చెందిన బాధితులు మునగనూరులోని గణేష్‌నగర్ కాలనీలో నివాసముండే బంధువుల ఇంటికి వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల గుల్షన్ సహాని అనే వ్యక్తి రేండేళ్ల పాపను బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించి ఆడిపిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story








