తల్లిపాలే బిడ్డకు అమృతం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

by Disha Web Desk 15 |
తల్లిపాలే బిడ్డకు అమృతం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
X

దిశ, బేగంపేట : తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో మూడు నెలలు నుండి 13 నెలల పసిపిల్లల కోసం హెల్తీ బేబీ కార్యక్రమం నిర్వహించాలని మోడీ ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గంలో జరిగిన హెల్తీ బేబీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ అక్కడికి వచ్చిన చిన్నారులతో ఫొటోలు దిగారు. చిన్నపిల్లల ఆరోగ్యం.. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు.

దేశంలోని ప్రతి ఎంపీ నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారన్నారు. పిల్లలను తల్లులు ఎంతో పోటీ తత్వంతో పెంచుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇది చాలా మంచి పరిణామమన్నారు. కొందరు తల్లులు పిల్లలకు డబ్బా పాలు ఇస్తారని.. అయితే తల్లి పాలే మంచిదన్నారు. తల్లి పాల వల్ల పిల్లలు పెద్ద అయ్యాక కూడా రోగనిరోధక శక్తి కలిగి ఉంటారని తెలిపారు. అనంతరం హెల్తీ బేబీ షో సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, అమీర్పేట కార్పొరేటర్ కేతినేని సరళ, జిల్లా డీఎంహెచ్​ఓ అధికారులు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed