'రాన్' లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ల సందడి

by Disha Web Desk 15 |
రాన్ లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ల సందడి
X

దిశ, శేరిలింగంపల్లి : సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ కు చెందిన స్టార్ క్రికెటర్లు కొండాపూర్‌ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్' లో మంగళవారం సందడి‌‌ చేశారు. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ రాన్ కు అధికారిక భాగస్వామి. స్టార్ క్రికెటర్లు ‌హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్‌ లు అభిమానులతో ఆత్మీయంగా మాట్లాడారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. అనంతరం క్రికెటర్లు షాపింగ్ చేశారు. తమకు కావాల్సిన దుస్తులు తీసుకున్నారు. క్రికెటర్లు షాపింగ్ కు విచ్చేశారని తెలియడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అభిమానులతో రాన్ కిక్కిరిసిపోయింది. తమ అభిమాన క్రికెటర్లను చూసి పులకించిపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

Next Story

Most Viewed