మేము ఇద్దరం ఒకే అమ్మాయిని లవ్ చేసి పెద్ద తప్పు చేశాము.. సోదరుడు గురించి అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
మేము ఇద్దరం ఒకే అమ్మాయిని లవ్ చేసి పెద్ద తప్పు చేశాము.. సోదరుడు గురించి అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో, కామెడీకా కింగ్ అల్లరి నరేష్ ప్రస్తుతం ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటించింది. చిలకా ప్రొడక్షన్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ మే 3న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మూవీ అండ్ టీం. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంటర్వ్యూలో భాగంగా మీరు మీ సోదరుడు ఆర్యన్ కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా తీస్తారు అనే ప్రశ్న ఎదురైంది నరేష్‌కు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘గతంలోనే మేము ఇద్దరం కలిసి నటించిన చిత్రం ‘నువ్వంటే నాకిష్టం’. ఆ మూవీలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తాం. ఆ సినిమాలో మేము ఇద్దరం అన్నాతమ్ముళ్లం కానప్పటికీ.. బయట రియల్ బ్రదర్స్ అని అందరికి తెలుసు. కాబట్టి ఒకే అమ్మాయిని మేమిద్దరం ప్రేమిచడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. బ్రదర్స్ ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం ఏంటి అని ఛీ కొట్టారు. ఫలితంగా మూవీ ఫ్లాప్ అయింది. కాబట్టి అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూడాలి. బ్రదర్ సెంటిమెంట్‌తో మంచి కథవస్తే అప్పుడు ఆలోచిస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్.

Next Story

Most Viewed