ఏది నిజం? అక్రమమా... సక్రమమా..జేసీబీతో ప్రహరి తొలగించిన జీపీ సిబ్బంది

by Aamani |
ఏది నిజం? అక్రమమా... సక్రమమా..జేసీబీతో ప్రహరి తొలగించిన జీపీ సిబ్బంది
X

దిశ, దుగ్గొండి: గ్రామ పంచాయతీ స్థలం అన్యాక్రాంతంమైందా లేదా..అధికారుల తప్పుడు నివేదికలతో అభాగ్యులు బలవుతునారా..?. అక్రమ నిర్మాణం అని పంచాయతీ సిబ్బంది అర్ధరాత్రి ప్రహరీ గోడ కూల్చేసిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో జరిగింది. బాధితుడు కందికొండ శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన తొగరు సమ్మయ్య వద్ద శ్రావణ్ 480 పైసలు ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి 2018 సంవత్సరంలో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న అని అయితే ఇదే స్థలం గ్రామ పంచాయతీ పక్కన ఉన్నది. గ్రామ పంచాయతీ వెనకాల ఉండటంతో గ్రామానికి చెందిన కొందరు గ్రామ పంచాయతీ స్థలం కబ్జాకు గురైందని, మాజీ సర్పంచ్ భర్త అమ్ముకున్నారని ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదుపై విచారణ అధికారిగా మండల పంచాయతీ అధికారి శ్రీధర్ గౌడ్ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రామ పంచాయతీ స్థలం, ఎవరు అమ్ముకోలేదని కబ్జాకు గురికాలేదని ఉండే స్థలం కంటే గ్రామపంచాయతీకి ఐదు సెంట్ల స్థలం ఎక్కువనే ఉన్నదని విచారణలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిపోర్టు సమర్పించారు.

దీంతో బాధితుడు శ్రవణ్ ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుమతుల కోసం పంచాయతీ అధికారి దగ్గరికి వెళ్ళగా అసభ్య పదజాలంతో పంచాయతీ కార్యదర్శి తనను దూషించారని పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ గత సంవత్సరం గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇదే స్థలం విషయమై గ్రామస్తుల ద్వారా పంచాయతీ కార్యదర్శికి శ్రవణ్ కు ఇంటి నిర్మాణ అనుమతి ఇవ్వరాదని ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి సదరు శ్రావణ్ కు పోస్టు ద్వారా అక్రమ నిర్మాణం చేస్తున్నారని అనుమతులు తీసుకొని ఎడల నిర్మాణాన్ని తొలగించడం జరుగుతుందని నోటీసులు ఇచ్చారు. అనంతరం డీపీఓ కల్పన విచారణ అధికారిగా హాజరై గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపి గ్రామపంచాయతీ భూమి అన్యక్రాంతానికి గురవుతుందని నివేదిక ఇచ్చారు.

ఈ నివేదిక అందుకున్న పంచాయతీ కార్యదర్శి తమ ఆధీనంలో ఉన్న సిబ్బందితో గురువారం తెల్లవారుజామున శ్రావణ్ నిర్మించిన టువంటి ప్రహరీ గోడను గ్రామ పంచాయతీ సిబ్బంది వెంట ఉండి జెసీబీ సహాయంతో ప్రహరీని కూల్చేశారు. ఒకే స్థలం గూర్చి అధికారులు రెండు విధాలుగా విచారణ నివేదికను సమర్పించడంతో తాను నష్టపోయామని బాధితుడు శ్రవణ్ వాపోయారు. అక్రమ నిర్మాణం చేపడుతున్నానని తనకు ఒకేసారి నోటీసు వచ్చిందని నిర్మాణాన్ని తొలగించే క్రమంలో తనకు కనీస సమాచారం లేకుండా తొలగించారని బాధితుడు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబించడం పట్ల మండల ప్రజలు ఇదేం తీరు అని చర్చించుకుంటున్నారు.

మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్ గౌడ్ వివరణ

ప్రహరీ గోడ తొలగింపు విషయంలో మండల పంచాయతీ అధికారిని వివరణ కోరగా గ్రామ పంచాయతీ స్థలం అన్యక్రాంతమవుతుందని విచారణ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి కల్పన హాజరై ఇచ్చిన నివేదిక ఇచ్చింది. ఆప్రకారం శ్రావణ్ ఇంటి నిర్మాణానికి చేసుకున్న దరఖాస్తును తిరస్కరించి అక్రమ నిర్మాణం చేస్తున్నందున గ్రామ పంచాయతీ సిబ్బంది చేత ప్రహరీ గోడను జెసిబి తో తొలగించామని తెలిపారు. కాని రాత్రి సమయంలో ప్రహరీ గోడని తొలగించిన విషయం తనకు సమాచారం లేదని తెలపడం గమనార్హం.



Next Story

Most Viewed