జీన్స్ ధరించినప్పుడల్లా ఉతుకుతున్నారా?.. కానీ అలా చేయకపోవడమే బెటర్

by Dishafeatures2 |
జీన్స్ ధరించినప్పుడల్లా ఉతుకుతున్నారా?.. కానీ అలా చేయకపోవడమే బెటర్
X

దిశ, ఫీచర్స్ : కామన్‌ మెన్ నుంచి బిలీనియర్ వరకు మొత్తం ఫ్యాషన్ ప్రంపంచాన్నే ఆకట్టుకున్న మోస్ట్ పాపులర్ అండ్ స్టైలీ క్లాతింగ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి జీన్స్ మాత్రమే. పిల్లల నుంచి పెద్దల వరకు ఆడా మగా తేడా లేకుండా అందరూ వీటిని ధరించడానికి ఇష్టపడతారు. అయితే చాలామంది ఇతర దుస్తుల మాదిరిగానే వీటిని కూడా ఉతకడం, ఐరన్ చేయడం చేస్తుంటారు. కానీ వాస్తవానికి అవసరం లేదంటున్నారు నిపుణులు.

జీన్స్‌ ప్యాంట్లను ఎక్కువగా ఉతకకపోవడం, ఐరన్ చేయకపోవడం వల్లే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఉతకాల్సి వస్తే కనీసం ఐదారుసార్లు ధరించిన తర్వాతే ఆ పనిచేయడం బెటర్. ఒకవేళ ఎక్కువగా మురికిగా అనిపిస్తే ఫ్యాబ్రిక్ స్ర్పే వంటివి యూజ్ చేయాలి. అంతే కానీ అధికంగా ఉతకవద్దు. అలాగే వేడినీటిలో కూడా ముంచవద్దు. నార్మల్ వాటర్‌తో ఉతికితేనే చాలాకాలం మన్నికగా ఉంటాయి. ఐరన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇలా చేస్తే త్వరగా చినిపోయే చాన్సెస్ ఉంటాయి.

Next Story

Most Viewed