కుమారుడితో సహా మహిళ అదృశ్యం..

by Aamani |
కుమారుడితో సహా మహిళ అదృశ్యం..
X

దిశ,దుండిగల్ : కుమారుడితో సహా మహిళ అదృశ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ మున్సిపాలిటీ,బౌరంపేట గ్రామానికి చెందిన భూపాల్,పావని(24) భార్యాభర్తలు. వారికి వెంకటేష్ (4) కుమారుడు ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కుమారునితో బయటకు వెళ్లిన పావని తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త భూపాల్ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఆచూకీ తెలిస్తే 8341951951,9490617220,8712663279 కు సమాచారం ఇవ్వాలన్నారు.

Next Story