గదిలో వెలిగిన లైట్.. ఇద్దరీ ప్రాణాలను బలితీసుకుంది...

by Bhanu |

హైదరాబాద్ అల్వాల్ సూర్యనగర్ కాలనీలో ఇటీవల జరిగిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు 72 గంటల్లో చేధించారు. జీవిత ఖైదు శిక్షపడిన నిందితుడు హై-కోర్టు ఉత్తర్వులతో జైలు నుంచి విడుదలయ్యి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

గదిలో వెలిగిన లైట్.. ఇద్దరీ ప్రాణాలను బలితీసుకుంది...
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ అల్వాల్ సూర్యనగర్ కాలనీలో ఇటీవల జరిగిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు 72 గంటల్లో చేధించారు. జీవిత ఖైదు శిక్షపడిన నిందితుడు హై-కోర్టు ఉత్తర్వులతో జైలు నుంచి విడుదలయ్యి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, అదనపు డీసీపీ పురుషోత్తమ్ యాదవ్ తో కలిసి బుధవారం వివరాలను వెల్లడించారు. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన చింతకింది అనిల్ 2016 సంత్సరంలో బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ మైనర్ పై లైంగికదాడి, హత్య చేసిన కేసులో జీవిత్ ఖైదు శిక్షపడింది. దీంతో చంచల్ గూడ జైలు లో ఉన్నాడు. ఏప్రీల్ 26వ తేదిన హై-కోర్టు లో అప్పీల్ కు వెళ్ళి జైలు నుంచి విడుదలయ్యాడు. ఇంటికి వెళ్ళగా ఇంట్లో వారు అతనిని రానివ్వ లేదు. వచ్చినప్పటి నుంచి అనిల్ చోరీల కోసం రెక్కీ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో మే 2న ఓ ఇంటిలో చోరీకి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇ:ట్లో వారు నిద్ర లేవడంతో పారిపోయాడు. 3 వే తేది రాత్రి సమయంలో సూర్యనగర్ కాలనీలో తిరుగుతుండగా ఓ రేకుల గదిలో లైట్ వెలగడం కనపడింది. అక్కడికి వెళ్ళి చూడగా ఇద్దరు వ్రుద్ధులైన భార్యభర్తలు నిద్రపోతున్నట్లు గుర్తించాడు. దీంతో గదికి ఉన్న డోర్ ను ఇనుప రాడ్ తో తీసి వారి పై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత చనిపోయిన వ్రద్ధురాలు ఒంటి పై ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, ఇంట్లో ఉన్న నగదును తీసుకుని పారిపోయాడు. మరణించిన అల్లీ కనకయ్య, రాజమ్మల బంధువుల ఫిర్యాదు పై అల్వాల్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

100 సీసీ కెమెరాలు పరిశీలన

ఈ డబుల్ మర్డర్ సంచలనం రేపడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు మొత్తం సీసీఎస్, ఎస్ఓటీ, అల్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. వీటిలో కొంత క్లూ లభించింది. దానిని విశ్లేషించుకోవడంతో పాటు హత్య తర్వాత మరణించిన భార్యభర్తల ఫోన్ లు మిస్సింగ్ కావడంతో వాటిని సాంకేతిక పరిజ్ణాణంతో క్రోడీకరించారు. అదే విధంగా జైలు నుంచి విడుదలైన ఖైదీల చిట్టాను జల్లెడ పట్టారు. అప్పడు కరుడుగట్టిన నిందితుడు అనిల్ గురించి సమాచారం అందింది. దీంతో మంగళవారం అనుమానాస్పదంగా అనిల్ అల్వాల్ తిరుగుతుండడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా జంట హత్య మిస్టరీ వీడిపోయింది.

పొద్దున ఎంజీబీబీఎస్ బస్సు స్టేషన్ ప్లాట ఫాం పై రాత్రంతా అల్వాల్ లో

దర్యాప్తులో అనిల్ పోలీసు నిఘా నుంచి తప్పించుకునేందుకు జైలు నుంచి వచ్చిన తర్వాత ఉదయం సమయంలో ఎంజీబీబీఎస్ బస్సు స్టేషన్ ప్లాట్ ఫాం పై ఉంటున్నాడు. రాత్రి సమయంలో అల్వాల్ ప్రాంతంలో తిరుగుతు చోరీల కోసం రెక్కీ చేస్తున్నాడని పోలీసుల విచారణ లో తెలిసింది. ఉదయంల అల్వాల్ లో తిరిగితే తనను పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించే అవకాశం ఉండడంతో ఇలా పగటి పూట ఒక చోట రాత్రి సమయంలో చోరీల కోసం సంచరించినట్లు విచారణలో పోలీసులకు అనిల్ వెల్లడించినట్లు తెలిసింది. అనిల్ పై మొత్తం 29 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ వయస్సు నుంచే నేరాల బాట పట్టి జువెనైల్ గా కూడా నమోదయినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘోరానికి పాల్పడ్డ అనిల్ కు బెయిల్ రాకుండా అతని పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ కోటిరెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును చేధించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. ప్రజలు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసు లకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిందితుడు నుంచి 20 వేల నగదు, బంగారం పుస్తెలతాడు, 152 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. రెండు హత్యలతో పాటు 27 చోరీల కేసులలో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు.


Next Story