ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు

by Ratna Kumari |

ప్ర‌యాణికుల‌కు ర‌వాణా సౌక‌ర్యాల్లో ఎలాంటి ఆటంకాలు క‌లుగ‌కుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ తెలిపారు.

ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు
X

దిశ, కార్వాన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల స‌మ్మె కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌యాణికుల‌కు ర‌వాణా సౌక‌ర్యాల్లో ఎలాంటి ఆటంకాలు క‌లుగ‌కుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ తెలిపారు. ఉదయం నుంచే కార్మికులు సమ్మెకు దిగినప్పటికీ.. పోలీసుల భద్రత మధ్య ప్రత్యామ్నాయ చర్యల ద్వారా విద్యుత్, అద్దె, ఔట్ సోర్సింగ్ డ్రైవర్ల సహకారంతో ఇప్పటివరకు 1600 బస్సులను ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 శాతం మేర బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచారన్నారు.

సాధారణంగా ఆర్టీసీకి రోజుకు సుమారు 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వస్తుందని, అయితే ప్రస్తుత సమ్మె పరిస్థితుల వల్ల ఆదాయం ఆ స్థాయిలో ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర విభాగాల సమన్వయంతో సేవలందిస్తున్నామని, ఎక్కడా రవాణా నిలిచిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రవాణా శాఖ, పోలీస్ యంత్రాంగం సహకారంతో బస్సు సర్వీసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఈడీ తెలిపారు.

Next Story