గద్దరన్నకు ఇది శాశ్వత గుర్తింపు: బాలయ్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-14 16:29:30  IST  )

గద్దరన్న పేరుతో సినీ నటులకు అవార్డులిచ్చి ఆయనకు శాశ్వత గుర్తింపు ఇచ్చారని నటుడు, ఎమ్మెల్యే బాలయ్య అన్నారు...

గద్దరన్నకు ఇది శాశ్వత గుర్తింపు: బాలయ్య
X

దిశ, వెబ్ డెస్క్: గద్దరన్న(Gaddar) పేరుతో సినీ నటులకు అవార్డులిచ్చి ఆయనకు శాశ్వత గుర్తింపు ఇచ్చారని నటుడు, ఎమ్మెల్యే బాలయ్య(Mla Balayya) అన్నారు. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ (Telangana Gaddar Awards) కార్యక్రమం హైదరాబాద్ ఐటెక్స్‌(Hyderabad Itex)లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు(Ntr National Film Award)ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కళలకు చావు లేదు. తెలంగాణ ముద్దు బిడ్డ గద్దరన్న పేరు మీద అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని గద్దర్ సంపాదించుకున్నారు. గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. విశ్వాసానికే విశ్వనట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్టీఆర్ అవార్డులను ప్రారంభించారు. రాష్ట్రాలు వేరు అయినా మనమంతా తెలుగువాళ్లమే. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చలన చిత్ర ఉత్సవాన్ని జరుపుతుందన్నందుకు, అందులో నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ తనయుడిగా ఆ అవార్డును తెలంగాణలో మొట్టమొదటి సారి గ్రహీతను అవడం నా పుర్వజన్మసుకృతంగా భావిస్తున్నా. అవార్డుతో పాటు ఇచ్చారని, ఆ డబ్బును బసవతారకం ఆస్పత్రి సేవలకు వినియోగిస్తాం.’’ అని బాలయ్య తెలిపారు.

Next Story