ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

by Naveena |   (  Updated:2025-03-17 14:44:53  IST  )

మహబూబ్ నగర్ ఎంపీ, బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించి దాదాపు అర గంట పాటు ఇంట్లోనే తిరిగిన సంఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం
X

దిశ, సిటీక్రైం : మహబూబ్ నగర్ ఎంపీ, బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించి దాదాపు అర గంట పాటు ఇంట్లోనే తిరిగిన సంఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే సోమవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ జూబ్లీ హిల్స్ రోడ్డు నెం. 56 లో డికే అరుణ ఇంటికి వెళ్ళి పరిశీలించారు. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి , తిరిగి ఏలా వెళ్ళిపోయాడనే కోణంలో సీపీ ఆరా తీశారు. అదే విధంగా డికే అరుణ ఇంటి వద్ద భద్రత కు సంబంధించిన పలు సూచనలను స్థానిక పోలీసు అధికారులకు సీపీ సూచించారు. ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్న పోలీసులు అగంతకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం లను రంగంలోకి దింపారు.

Read More..

అగ్నివీర్‌ నియామక ర్యాలీకి దరఖాస్తు చేసుకోవాలి

Next Story