- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు అరెస్ట్
దళిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడి పై కేసు నమోదు చేసినా పోలీసులు అరెస్టు చేయడం లేదని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.

దిశ, వనస్థలిపురం : దళిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడి పై కేసు నమోదు చేసినా పోలీసులు అరెస్టు చేయడం లేదని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. దళిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుద్వార్ రోడ్డులో ఉన్న స్మైల్ డెంటల్ క్లినిక్ లో వైద్యం కోసం వెళ్తే డాక్టర్ శివకుమార్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంతో పాటు రాజకీయ ఒత్తిడిల కారణంగా వైద్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
బాధితురాలితో కలిసి దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పోలీసులు సాధారణ కేసు నమోదు చేసి నిందితుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. అన్ని విధాల సహకరిస్తున్నారని తెలిపారు. పోచంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ శివ కుమార్ రెడ్డి తనకు భువనగిరి ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటున్నారని తెలిపారు. వైద్యుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దళిత మహిళకు న్యాయం జరగకపోతే డీజీపీ, మల్కాజిగిరి కమిషనర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు సంగపాక జోసఫ్, జీడి నర్సింహ, పిట్టగడల రాణి, పార్వతమ్మ మాదిగ దండోరా నాయకుడు చేవూరి రాజు, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి శ్రీనివాసులు, మాల మహానాడు నాయకులు టి.అన్నపూర్ణాదేవి, డి.అనూష, బి.జ్యోతి పాల్గొన్నారు






