మట్టి గణనాథుల పంపిణీకి 34 కేంద్రాలు : HMDA

by Muthe.Rajitha |

మరికొద్ది రోజుల్లో వినాయక ఉత్సవాలు మొదలు కానున్నాయి.

మట్టి గణనాథుల పంపిణీకి 34 కేంద్రాలు : HMDA
X

దిశ, వెబ్ డెస్క్ : మరికొద్ది రోజుల్లో వినాయక ఉత్సవాలు మొదలు కానున్నాయి. అయితే పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను వాడొద్దని, మట్టి గణపతులనే(Eco Freindly Ganapathi) పూజించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) పిలుపునిచ్చింది. పర్యావరణహిత వినాయకులను పూజించాలని పిలుపునివ్వడమే కాదు... ప్రతియేడు లాగే ఈ ఏడాది కూడా వేలాది మట్టి గణపతులను భక్తులకు ఉచితంగా పంచేందుకు సిద్ధం అయింది.

అందుకోసం నగరంలో పలు కేంద్రాల్లో మట్టి వినాయకులను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దాదాపు 34 కేంద్రాల్లో ఈ మట్టి గణపతులు పంపిణీ పూర్తిగా ఉచితం అని పేర్కొంది. నగరవ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈనెల 24,25,26 తేదీల్లో లక్ష వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. మట్టి గణపతులు పంపిణీ కేంద్రాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story