పాతబస్తీలోని ప్రయివేట్​ పాఠశాలలో దారుణం..

by Disha Web Desk 20 |
పాతబస్తీలోని ప్రయివేట్​ పాఠశాలలో దారుణం..
X

దిశ, చార్మినార్​ : పాతబస్తీ పురాణి హవేలిలోని ఓ ప్రయివేట్​ పాఠశాలలో 2వ తరగతి విద్యార్థిపై 6వ తరగతి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మీర్​చౌక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే పాతబస్తీకి పురాణిహవేలిలోని ముక్రంజా స్కూల్‌లో అదే ప్రాంతానికి చెందిన బాలుడు 2వ తరగతి చదువుతున్నాడు.

గత కొన్ని రోజులుగా 2వ తరగతి చదువుతున్న బాలుడిని చంపేస్తానని బెదిరించి పాఠశాలలోని టాయిలెట్స్​లో 6వ తరగతికి చెందిన పలువురు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడతున్నారు. దీంతో ఆ బాలుడికి తరచు అనారోగ్య పరిస్థితులు తలెత్తుతుండంతో తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని బాలుడు తండ్రికి చెప్పాడు. బాధితుడి తండ్రి మీర్​ చౌక్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్​చౌక్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed