- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD Traffic Police: సీరియస్‌గా తీసుకోండి.. అనవసరంగా బయటకు రాకండి
రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) కీలక సూచనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇవ్వాలని ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు చెప్పిన విషయం తెలిసిందే. వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేసుకునేందుకు ఉద్యోగులంతా ప్రయత్నం చేయాలని అన్నారు. యువకులు కూడా అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని.. సీరియస్‌గా తీసుకోండి అని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పారు. ఈనెల 15వ తేదీ వరకు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఈ వాన కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. హైటెక్ సిటీలోని ఐకియా కూడలి వద్ద భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు చేపట్టారు.






