2050 దిశగా హైదరాబాద్.. తుది దశలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్

by Ramesh Naini |

హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పన తుది దశకు చేరుకుంది.

2050 దిశగా హైదరాబాద్.. తుది దశలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పన తుది దశకు చేరుకుంది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎకానమిక్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఈడీపీ), కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ), బ్లూ, అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్లకు నివేదికలను రూపొందించారు. వీటిలో ముఖ్యంగా ప్రజా రవాణాకు సంబంధించిన మొబిలిటీ ప్లాన్ కీలకంగా మారింది. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)-2050 అమలు చేయడానికి రూ.4 లక్షల కోట్లు అవసరమని హెచ్ఎండీఏ అంచనా వేసింది. ఎకానమిక్ డెవలప్‌మెంట్ ప్లాన్‌కు సంబంధించిన రిపోర్టు రెడీ చేశారు. దీనిపై పలుమార్లు వర్క్ షాప్ నిర్వహించారు. బ్లూ, గ్రీన్ ప్లాన్‌కు సంబంధించిన నివేదిక రెడీ అయింది. అయితే స్టేక్ హోల్డర్స్ చివరి వర్క్ షాప్ నిర్వహించాల్సి ఉంది. చివరిగా బేస్ మ్యాప్ రూపొందించడానికి త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. మొత్తంగా 2027లోనే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి రానుంది.

11,328 చ.కిలో మీటర్లకు ఒకే బేస్ మ్యాప్

హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో బేస్ మ్యాప్ కీలకంగా మారింది. హెచ్ఎండీఏ 10,472.72 చదరపు కిలోమీటర్లు, ఫ్యూచర్ సిటీ 765.28 చ.కిలోమీటర్లు, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి 90 చ.కిలోమీటర్ల మొత్తం 11,328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒకే బేస్ మ్యాప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్ని రకాల ఆస్తులను జియో బేస్ మ్యాప్‌లో పొందుపర్చనున్నారు.

Next Story