WARNING : హైదరాబాద్‌లో భారీ వర్షం..

by Sujitha Rachapalli |

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, చంద్రాయణగుట్ట, కాప్రా, మల్కాజ్‌గిరి, తార్నాక, ఓయూ, అల్వాల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.

WARNING : హైదరాబాద్‌లో భారీ వర్షం..
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, చంద్రాయణగుట్ట, కాప్రా, మల్కాజ్‌గిరి, తార్నాక, ఓయూ, అల్వాల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరమంతటికీ ప్రమాదకరమైన ఉరుములతో కూడిన తుఫాను రానుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంటి లోపలే ఉండాలని సూచించింది. భారీ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయని.. చాలా తక్కువ సమయంలో 50 మి.మీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Next Story