- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Messi India Tour: కోల్‌కతా స్టేడియంను గుళ్ల చేసిన ఫ్యాన్స్.. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు
Messi India Tour: కోల్‌కతా స్టేడియంను గుళ్ల చేసిన ఫ్యాన్స్.. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi) ఇండియా టూర్ కొనసాగుతోంది. శనివారం ఉదయం కోల్‌కతాలో పర్యటించారు. మెస్సీ కోల్‌కతా పర్యటనను గుర్తుండిపోయేలా చేయడానికి ఆ రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ చొరవతో లేక్ టౌన్‌లో ఈ విగ్రహం తయారు చేశారు. శనివారం ఉదయం ఈ విగ్రహాన్ని ప్రముఖ మెస్సీ, నటుడు షారుఖ్ ఖాన్‌తో కలిసి మరో ఫుట్‌బాల్ యువరాజు మారడోనా స్వయంగా ఆవిష్కరించారు. అనంతరం కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వచ్చారు. ఈ సమయంలో అభిమానులంతా మెస్సీ మ్యాచ్ ఆడుతాడని ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే అనూహ్యంగా మెస్సీ నిమిషాల్లోనే వెళ్లిపోవటం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో, స్టేడియం లోనే విధ్వంసానికి దిగారు. కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్లు విసిరి వేసారు. ఈ ఘటనలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. మైదానంలోకి అభిమానులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ మైదానం వద్ద అదనపు బలగాలు మెహరించాయి. ఉప్పల్ మ్యాచ్‌లో మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆడనుండటంతో మరింత ఆసక్తిని రేపుతోంది. దీంతో ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






