- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MMTS అత్యాచార ఘటనలో మరో ట్విస్ట్.. రేప్ అటెంప్ట్ చేసారంటూ యువతి !
ఎంఎంటీఎస్ రైలులో ( Hyderabad MMTS Train ) యువతిపై ( Lady ) అత్యాచారయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఎంఎంటీఎస్ రైలులో ( Hyderabad MMTS Train ) యువతిపై ( Lady ) అత్యాచారయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వాదనను కొట్టి పారేసిన ఎంఎంటీఎస్ ( MMTS) అత్యాచారయత్నం బాధితురాలు.. షాకింగ్ నిజాలు బట్టబయలు చేసింది. తాను పోలీసులను ఎక్కడా తప్పుదోవ పట్టించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడిని తనకు చూపించినప్పుడు గుర్తుపట్టాను అంటూ బాధితురాలు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ ( Secunderabad ) నుంచి మేడ్చల్ ( Medchal ) వెళుతుండగా ఎంఎంటీఎస్ లో గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ పేర్కొంది. దుండగుడు నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాను అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది బాధితురాలు. తనకు జరిగినట్లు ఏ యువతీకి జరగకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 22వ తేదీన తనపై జరిగిన అత్యాచారయత్నంపై పోలీసులు మరోసారి విచారణ జరపాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.... ఎంఎంటీఎస్ రైలు ( Hyderabad MMTS Train ) కదిలే ట్రైన్ లో యువతిపై అత్యాచారం చేసిందన్నది అవాస్తవమంటూ ఇవాళ ఉదయం పోలీసులు తేల్చి చెప్పారు. ఇన్ స్టాలో రీల్స్ చేస్తుండగా... యువతి రైలు నుంచి కింద జారిపడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు ప్రకటన వెలువడింది. 250 సీసీ కెమెరాలు పరిశీలించినప్పటికీ... 100 మంది అనుమానితులను విచారించినప్పటికీ... అత్యాచార యత్నం జరిగినట్లు ఎక్కడ ఆధారాలు దొరకలేదట. ఈ మేరకు కేసును క్లోజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.






