HYD: శోభాయాత్రలో ‘ఆపరేషన్ సిందూర్’ వినాయకుడి సందడి (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-09-10 04:00:57  IST  )

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.

HYD: శోభాయాత్రలో ‘ఆపరేషన్ సిందూర్’ వినాయకుడి సందడి (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. బుజ్జి బుజ్జి గణపయ్యలతో పాటు బడా బడా వినాయకులు గంగమ్మ చెంతకు చేరేందుకు ట్యాంక్ బండ్ వైపు క్యూ కట్టారు. ఈ క్రమంలో నగరంలో పలు వీధుల్లో వినాయక శోభయాత్ర సందడి నెలకొంది. పలు రూపాల్లోని గణనాథుని విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ శోభయాత్రలో 'ఆపరేషన్ సిందూర్' నమూనాలోని వినాయకుడు నిమజ్జనానికి వెళ్తుండటం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ లో చేతిలో తుపాకీ పట్టుకున్న గణేషుడి విగ్రహం చూసిన భక్తులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నిమజ్జనం వాహనంపై ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Click for Video

Next Story