HYD: మందుబాబులారా ఇది మీకే.. ఇక "ఎనీ టైం, ఎనీ ప్లేస్" అంటున్న పోలీసులు

by Bhanu |

మందుబాబులు మత్తు దించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఇకపై ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం,

HYD: మందుబాబులారా ఇది మీకే.. ఇక ఎనీ టైం, ఎనీ ప్లేస్ అంటున్న పోలీసులు
X

దిశ, సిటీ క్రైం: మందుబాబులు మత్తు దించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఇకపై ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు ఎక్కడైనా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జరగనున్నాయి. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ అకస్మికంగా తనిఖీలు జరిపినప్పుడు, 25 మందికి పైగా డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు బయటపడింది. అందులో కొన్ని స్కూల్ ఆటోలు, వాన్లు ఉండటం ప్రజలను కలవరపరిచింది.

ఈ పరిణామాల నేపథ్యంలో "ఎనీ టైం, ఎనీ ప్లేస్" అన్నట్లు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్ ఏసీపీ ధనలక్ష్మి ఆధ్వర్యంలో గోషామహల్, కుల్సుంపుర, అలస్కా జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

బుధవారం జరిగిన తనిఖీల్లో ఉదయం 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్టు ఏసీపీ తెలిపారు. ఇకపై రోజూ, ఎప్పుడైనా తనిఖీలు జరుగుతాయన్న విషయం స్పష్టం చేశారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Next Story