HUSH DATING: హుష్ డేటింగ్.. హైదరాబాద్‌లో మరో గబ్బు కల్చర్

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లో హుష్ డేటింగ్ అనే మరో కొత్త కల్చర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. హుష్ డేటింగ్ అంటే పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ సైలెంట్ గా డేటింగ్ చేస్తారు.

HUSH DATING: హుష్ డేటింగ్.. హైదరాబాద్‌లో మరో గబ్బు కల్చర్
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు పెద్దలు చెప్పినవాళ్లనే పెళ్లి చేసుకుని జీవితాంతం వారితోనే కలిసి ఉండేవాళ్లు. ఆ తరవాత ప్రేమ పెళ్లిళ్లు కూడా మొదలయ్యాయి. ప్రేమించుకోవడం పెద్దలను ఒప్పించి లేదా ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుని కలిసి ఉండటం చేసేవాళ్లు. ఆ తరవాత ప్రేమించుకోవడం ఎవరికి నచ్చినవాళ్లను వాళ్లు పెళ్లి చేసుకోవడం అనే ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు అదే ట్రెండ్ ను యూత్ మరికొన్ని కొన్ని కొత్త పేర్లతో, సరికొత్తగా ఫాలో అవుతున్నారు. దానికి డేటింగ్ అనే పేరు ఉండగా ఆ డేటింగ్ లో చాలా రకాలు ఉన్నాయి. కొందరు క్యాజువల్ డేటింగ్ చేస్తారు. ఇక్కడ సీరియస్ కమిట్మెంట్ ఉండదు. నచ్చినన్ని రోజులు కలిసి ఉండి తరవాత విడిపోతారు. ఆన్ లైన్ డేటింగ్.. ఇక్కడ భౌగోళిక సరిహద్దులు లేకుండా నచ్చిన వ్యక్తులను వెతుక్కుంటారు. ఆన్ లైన్ పరిచయం తరవాత నేరుగా మనుషులను కలిసి వారితో ఎంతదూరం అయినా వెళతారు.

బైండ్ డేట్.. ఈ డేటింగ్ లో ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య అస‌లు ప‌రిచ‌య‌మే ఉండ‌దు. స్నేహితులు లేదా థ‌ర్డ్ పార్టీ వ్య‌క్తుల ద్వారా క‌లిసి వారితో గడుపుతారు. ఆ డేటింగ్ ఎక్కువ కాలం కూడా నిల‌వ‌దు. కొన్ని గంటలు లేదా న‌చ్చినంత‌సేపు మాత్ర‌మే క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే కొత్త డేటింగ్ క‌ల్చ‌ర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇందులో ఇద్ద‌రూ స్నేహితులే కానీ కేవ‌లం శారీర‌క సుఖం కోసం క‌లుస్తారు. శారీర‌క సుఖాలు తీర్చుకోవ‌డం త‌ప్ప ఇద్ద‌రిలో ఎలాంటి ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉండ‌దు. బెంచింగ్ అనే డేటింగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. బెంచింగ్ అంటే అప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నా బ్యాకప్ ఆప్షన్ కోసం మరొకరిని పెట్టుకుంటారు.

వారితో తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తారు. ఇవి ఇలా ఉండగానే ఇప్పుడు హైదరాబాద్ లో హుష్ డేటింగ్ అనే మరో కొత్త కల్చర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. హుష్ డేటింగ్ అంటే పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ సైలెంట్ గా డేటింగ్ చేస్తారు. అంటే తమ బంధం గురించి ఎవరికీ తెలియకుండా డేటింగ్ చేస్తారు. స్నేహితులు, సన్నిహితుల వద్ద కూడా విషయాన్ని దాచిపెట్టి డేటింగ్ చేస్తారు. ఇందులో కమిట్మెంట్ ఉండదు.. ప్రైవసీకి అంత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇద్దరూ డేటింగ్ లో ఉన్నా తమ పార్ట్ నర్ గురించి పట్టించుకోరు. వాళ్లు కూడా ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉండొచ్చు. వీళ్లు పబ్లిక్ ఎక్కువ ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఏకాంతంగా ఉండే ప్రదేశాలకే వెళుతుంటారు. ఐటీ రంగంలో ఈ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. రిలేషన్ షిప్ లో గొడవలు, ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఇలాంటి డేటింగ్ కల్చర్ కు యూత్ ఎక్కవ అట్రాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.

Next Story