- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల జోరు పెరిగింది. తొలి విడత ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచార హవా కొనసాగిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల జోరు పెరిగింది. తొలి విడత ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచార హవా కొనసాగిస్తున్నారు. ఇకపోతే రెండవ విడత ఎన్నికల్లో భారీగా సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండవ విడతలో 415 మంది సర్పంచులు, 8,304 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. కాగా అత్యధికంగా కామారెడ్డిలో 44 మంది అభ్యర్థులు, నల్గొండ, నిజామాబాద్ లో 38 మంది సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
రెండవ విడతలో 4,332 పంచాయితీ, 38,322 వార్డుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 గ్రామపంచాయితీలు, 107 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మొదటి రెండవ విడతలో కలిపి మొత్తం 810 మంది సర్పంచ్ అభ్యర్థులు, 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా రాష్ట్రంలో మూడు విడతల్లో.. ఈనెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.






