- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
111 ఫ్లాట్లకు 2,685 దరఖాస్తులు.. రేపే లాటరీ నిర్వహణ
అల్పాదాయ (ఎల్ఐజీ) వర్గాల కోసం హోసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: అల్పాదాయ (ఎల్ఐజీ) వర్గాల కోసం హోసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ఫ్లాట్లను ఎల్ఐజీ వర్గాలకు విక్రయించడానికి, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ హౌసింగ్ బోర్డు డిసెంబ ర్ 16న నోటిఫికేషన్ ఇచ్చింది. 3వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 3,096 దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ఒక్క హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని వివిధ అపార్ట్‌మెంట్లలో ఉన్న 111 ఫ్లాట్ల కోసం 2,685 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాజెక్టులోని ఫ్లాట్లకు 388 వచ్చాయి.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఖమ్మంలోని ఫ్లాట్లకు దరఖాస్తుల స్వీకరణ 8వ తేదీ వరకు పొడిగించారు. వీటికి సంబంధించిన లాటరీ ప్రక్రయను పూర్తి పాదర్శకంగా నిర్వహించడానికి హౌసింగ్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. 6న హైదరాబాద్, 8న వరంగల్, 10న ఖమ్మంలోని ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రజా సంబంధాల అధికారి వి.వాసు ఒక ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలోని ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాంకీ ప్రాజెక్టులోని 76 ఫ్లాట్లకు, మధ్యాహ్నం వసంత ప్రాజెక్టులోని 35 ఫ్లాట్లకు ఈ లాటరీ నిర్వహిస్తున్నారు. భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో దరఖాస్తుదారులు లాటరీ ప్రక్రియ చూడటానికి రావద్దని, ఈ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు.






