- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ORRపై ఘోర ప్రమాదం.. రోడ్డుపై ఎగిరిపడ్డ కారు
by Gantepaka Srikanth |
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోతారం ORRపై అతివేగంగా దూసుకొచ్చిన కారు ORRపై నుంచి సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో కారులో చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. నగరంలోని నెహ్రూ జూపార్క్ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






