TG: వాయిదా పడినవి మినహా.. ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయంటే?

by Prasad Jukanti |

తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.

TG: వాయిదా పడినవి మినహా.. ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నెల 11న తేదీన జరిగిన పోలింగిన పోలింగ్ ఫలితాల్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అనతంరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‍ల కోసం అధికారులు ఎన్నిక (Telangana municipal elections) నిర్వహించగా వీటిల్లో మెజారిటీ పీఠాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లకు (municipal corporations) గాను కాంగ్రెస్-5, సీపీఐ-కాంగ్రెస్ మిత్రం పక్షం-1, బీజేపీ -1 కైవసం చేసుకున్నాయి.

85 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి:

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు‍గాను కాంగ్రెస్‌ 85, బీజేపీ 1, బీఆర్ఎస్‌ 17, ఇతరులు 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ఇవాళ 105 మున్సిపాలిటీలకు మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్‍ల ఎన్నుకున్నారు. 11 చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి.

Next Story