- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అసెంబ్లీలో హరీశ్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్
అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ముఖ్యమంత్రి ఢిల్లీ వాయే.. జాబులేమో రాకపాయే’ అంటూ అశోక్ నగర్ లాఠీచార్జీలను హరీశ్‌రావు గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అమాయక యువత తలలు పగులుతున్నా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 10 ఏండ్లు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు ఏం ఇచ్చారు? అని ప్రశ్నించారు. 10 ఏండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని మంత్రి సీతక్క నిలదీశారు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినట్లేనా? అని ప్రశ్నించారు. పాండవులు సంపాదించింది అంత కౌరవుల తద్దినానికే సరిపోయింది అన్నట్లుగా ఉంది మా ప్రభుత్వ పరిస్థితి అని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోతుందని అన్నారు.
ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని సీతక్క చెప్పారు. హరీశ్ రావు నీ నియోజకవర్గానికి 50% రైతు రుణమాఫీ కాలేదు అంటున్నారు.. మరి మీ గవర్నమెంట్‌లో ఎందుకు చేయలేదు మీరు అపుడు చేసి ఉంటే ఇపుడు మీరు అంటున్నట్లుగా ఇబ్బంది ఉండకపోయేది కదా? అని ప్రశ్నించారు. 10 ఏండ్ల లో ఏం చేసిండ్రు లెక్కలతో సహా చెప్పండి అని మండిపడ్డారు. ‘మీ హయాంలో చాలా మంది రైతులు చనిపోయారు, మీ బాధ అంత అధికారం పోయింది అని హరీష్ అన్న, మేము చేస్తున్న వాటిలో మన్ను పోసి.. మీరు గొప్ప అని చెప్పుకోవడం కాదు, సీట్ మారినంత మాత్రాన చరిత్ర మారుతుందా? పదేండ్లు అంటే చాలా సమయం మీకు.. ఎందుకు చేయలేదు? మీ అప్పులకి వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు.. అవే సరిపోతున్నాయి, ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా పెడితే ఓర్వ లేకపోతున్నారు, మట్టి, దుమ్ము పోసుడు రాజకీయం కాదు, ముందు మీరు చేసింది చెప్పి.. మేము ఏం చేయాలో చెప్పండి’ అని మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.






