- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వే చేతకాని కాంగ్రెస్ మంచి పాలన ఎలా అందిస్తుంది? : బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద
ప్రభుత్వ వైఫల్యం డిప్యూటీ సీఎం భట్టి మాటలతో తేటతెల్లమైందని.. నిపుణుల మాటలను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ వైఫల్యం డిప్యూటీ సీఎం భట్టి మాటలతో తేటతెల్లమైందని.. నిపుణుల మాటలను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుల గణనపై తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. రూ.200 కోట్లతో చేపట్టిన సర్వేతో 2 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారని ఆరోపించారు. సర్వే సరిగా చేయడం చేతకాని ప్రభుత్వం మంచి పాలన ఎలా అందిస్తుందని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ ఏది చేసినా తిరోగమనమే అని.. అన్నింటా ఈ ప్రభుత్వం అభాసు పాలవుతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సహా బీసీ సంఘాలన్నీ రీ సర్వేకు డిమాండ్ చేశాయని.. ప్రజల నుంచి వస్తున్న రీ సర్వే డిమాండ్ వేరు..ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నది వేరు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో సర్వేలు జరిగినా.. రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే ఫెయిల్ అయిందన్నారు. రీసర్వే పేరిట మళ్లీ నాలుగు పేజీలు సర్వేలో జోడించి మమ అనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డేడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి రీ సర్వే చేస్తేనే న్యాయ స్థానాల్లో నిలబడుతుందన్నారు. సర్వేల్లో కాంగ్రెస్‌కు చావు దెబ్బ తప్పదని వచ్చిందని.. అందుకే స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని విమర్శించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదన్నారు.






