చదివింది ల్యాబ్ టెక్నీషియన్‌ కోర్స్.. ఏకంగా ఆసుపత్రి నిర్వహణ!

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-25 15:31:24  IST  )

తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల

చదివింది ల్యాబ్ టెక్నీషియన్‌ కోర్స్.. ఏకంగా ఆసుపత్రి నిర్వహణ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు వరంగల్‌లోని మడికొండ ప్రాంతంలో టీజీఎంసీ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్‌లో సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని E. జయరాం, E. భాగ్యలక్ష్మి అనే భార్యాభర్తలు క్లినిక్ ఏర్పాటు చేశారు. అయితే ఇది చట్టవిరుద్ధంగా నిర్వహిస్తూ.. ఇష్టారీతిన అశాస్త్రీయ పద్ధతులలో వందల సంఖ్యలో ఆంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్, మలేరియా ఇంజెక్షన్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం సేకరించారు. ల్యాబ్ టెక్నీషియన్‌ కోర్స్ చేసి.. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరు మీద హాస్పిటల్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

Next Story