బీసీ రిజర్వేషన్ల పోరాటానికి సెక్రటేరియట్ BC ఎంప్లాయిస్ మద్దతు

by Gantepaka Srikanth |

బీసీ రిజర్వేషన్ల పోరాటానికి సెక్రటేరియట్ BC ఎంప్లాయిస్ మద్దతు

బీసీ రిజర్వేషన్ల పోరాటానికి సెక్రటేరియట్ BC ఎంప్లాయిస్ మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రాష్ట్రపతి ఆమోదం లభించాలన్న డిమాండ్‌తో ప్రభుత్వ పిలుపు మేరకు ఆగస్టు 5, 6, 7 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలలో తెలంగాణ సెక్రటేరియట్ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొని సచివాలయ వాణిని బలంగా వినిపించారు. వారి నిబద్ధతతో కూడిన ఉద్యమాన్ని గౌరవిస్తూ సచివాలయంలోని అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని వర్గాల ఉద్యోగులు కలిసి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా ఒక్కటే అనే ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సంఘం అధ్యక్షులు గిరీ శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్, ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంధం సురేష్, మహిళా అసోసియేషన్ ప్రెసిడెంట్ రమాదేవి, జనరల్ సెక్రటరీ నివేదిత, కోఆపరేటివ్ ప్రెసిడెంట్ రెండ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story