- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్.. బేస్ మ్యాప్ కోసం నోటిఫికేషన్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పన తుది దశకు చేరుకుంది.

- సీఎంపీ, ఈడీపీ నివేదికలు రెడీ
- బ్లూ, గ్రీన్ రిపోర్టుపై చివరి వర్క్ షాపు
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పన తుది దశకు చేరుకుంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఎకానమిక్ డవలప్ మెంట్ ప్లాన్(ఈడీపీ), కంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ), బ్లూ, అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ లకు నివేదికలను రూపొందించారు. వీటిలో ముఖ్యంగా ప్రజారవాణకు సంబంధించిన మొబులిటీ ప్లాన్ కీలకంగా మారింది. కంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ)-2050 అమలు చేయడానికి రూ.4లక్షల కోట్లు అవసరమని హెచ్ఎండీఏ అంచనా వేసింది. ఎకానమిక్ డవలప్ మెంట్ ప్లాన్ కు సంబంధించిన రిపోర్టు రెడీ చేశారు. దీనిపై పలుమార్లు వర్క్ షాపు నిర్వహించారు. బ్లూ, గ్రీన్ ప్లాన్ కు సంబంధించిన నివేదిక రెడీ అయింది. అయితే స్టేక్ హోల్డర్స్ చివరి వర్క్ షాపు నిర్వహించాల్సి ఉంది. చివరిగా బేస్ మ్యాప్ రూపొందించడానికి త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 2027లోనే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ అందుబాటులో రానుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
11,328 చ.కిలోమీటర్లకు ఒకే బేస్ మ్యాప్
హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ లో బేస్ మ్యాప్ కీలకంగా మారింది. హెచ్ఎండీఏ 10,472.72 చదరపు కిలోమీటర్లు, ఫ్యూచర్ సిటీ 765.28చ.కిలోమీటర్లు, యాదగిరి గుట్ట టెంపుల్ డవలప్ మెంట్ ఆథారిటీ పరిధి 90 చ.కిలోమీటర్ల మొత్తం 11,328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒకే బేస్ మ్యాప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్ని రకాల ఆస్తులను జియో బేస్ మ్యాప్ లో పొందుపర్చనున్నారు. కాంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ), ఆర్థిక పరమైన అభివ్రుద్ధికి సంబంధించిన ఎకనామిక్ డవలప్ మెంట్ ప్లాన్(ఈడీపీ), నీటి వనరులు, పార్కులు, గ్రీనరీ డవలప్ మెంట్ కు ప్రణాళికలను సైతం మ్యాప్ లో పొందుపర్చనున్నారు. బేస్ మ్యాప్ ఆధారంగానే ల్యాండ్ యూజ్ ప్లానింగ్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే ఆర్ఎఫ్ఫీ
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050లో భాగంగా బేస్ మా్యప్ కోసం రిక్వెస్ట్ ఫర్ ఫ్రపోజల్(ఆర్ఎఫ్ఫీ) పిలవనున్నారు. బేస్ మ్యాప్ కోసం 12నెలలు సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఒక పక్క మాస్టర్ ప్లాన్ రూపకల్పన, మరో పక్క బేస్ మ్యాప్ పనులు కూడా జరిగే విధంగా రెండింటికి ఆర్ఎఫ్పీ పిలవనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2027లోనే కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో రానుందని అధికారులు చెబుతున్నారు.






