Siricilla: కేటీఆర్ టీ స్టాల్ లో హిమాన్షు..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-05-25 19:14:34  IST  )

సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చిన హిమాన్షు, కేటీఆర్ టీ స్టాల్ లో సందడి చేసింది.

Siricilla: కేటీఆర్ టీ స్టాల్ లో హిమాన్షు..వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం పర్యటించారు. తన స్నేహితులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన హిమాన్షు, ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హిమాన్షుకు ఆలయ అధికారుల నుంచి ప్రత్యేక ఆహ్వానం దక్కింది. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చిన హిమాన్షు, కేటీఆర్ టీ స్టాల్ లో సందడి చేసింది.

కేటీఆర్ పైన ఉన్న అభిమానంతో సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి ఆయన పేరుతోనే టీ స్టాల్ ఏర్పాటు చేశారు. గ‌తంలో ఈ టీ స్టాల్ ను పాత క‌లెక్ట‌ర్ అక్ర‌మంగా తొల‌గించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అనంత‌రం కేటీఆర్ త‌న డ‌బ్బుల‌తో సిరిసిల్లా గాంధీ చౌక్ ద‌గ్గ‌రే మ‌రో టీ స్టాల్ ను ఓపెన్ చేయించారు. ఈ క్ర‌మంలోనే హిమాన్షు ఈ టీ స్టాల్ కు వెళ్లారు. ఆ త‌ర్వాత సిరిసిల్లాలో ఉన్న ప‌వ‌ర్ లూమ్స్‌, చీర‌ల త‌యారీని ద‌గ్గ‌రుండి ప‌రిశీలించారు.





Next Story