- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌తో హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం భేటీ అయింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్‌భంగా తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను సీఎం హిమాచల్ ప్రదేశ్ మంత్రికి వివరించారు.
25 ఎకరాల సువిశాల స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో రూ. 200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. మల్లెపల్లి ఐటీసీని సందర్శించాలని హిమాచల్ మంత్రి బృందానికి సూచించారు. మంత్రి రోహిత్ కుమార్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై ఆసక్తి చూపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి విజన్ ను అభినందించారు.






