- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తెలంగాణలో హీటెక్కుతున్న 'హిల్ట్' రాజకీయం.. రేవంత్ రియాక్షన్‍పై ఉత్కంఠ
ప్రతిపక్షాల విమర్శలకు రేవంత్ ఇవ్వబోయే స్ట్రోక్ ఏంటనే చర్చ జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీ చూట్టూ రాజకీయ రగడ కొనసాగుతోంది. రాష్ట్రమంతా ఓ వైపు చలి వణికిస్తుంటే ఇండస్ట్రీ పాలసీకి సంబంధించిన భూబదలాయింపు వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ పీక్స్ కు చేరుకుని రాజకీయ సెగలు కక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సై అంటే సై అనేలా సవాళ్ల పర్వంతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పాలసీ ద్వారా రూ. 5 లక్షల కోట్లు దోచుకునేందుకు అధికార కాంగ్రెస్ ఈ కుంభకోణానికి తెర లేపిందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తుంటే ప్రతిపక్షాల విమర్శలంతా తూచ్ అని కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విపక్షాల ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. ఈ క్రమంలో హిల్ట్ పాలసీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటూ స్టేట్ పాలిటిక్స్ ను మరింత రసకందాయంలోకి నెట్టుతోంది.
నిన్న బీఆర్ఎస్, నేడు బీజేపీ
హిల్ట్ పాలసీ విషయంలో మొదట ఆరోపించిన బీఆర్ఎస్ నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హిల్ట్ పాలసీ పేరుతో రూ. 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుభకోణం అని అలాంటి దానిపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? అంటే ఈ రూ. 5 లక్షల కోట్ల అవినీతిలో మీకూ భాగస్వామ్యం ఉన్నట్టేనా అని కేటీఆర్ ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. హిల్ట్ పాలసీ విషయంలో లీగల్ ఫైట్ కు సైతం వెళ్తామని బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది.
ధర్నాలకు సిద్ధమైన బీజేపీ:
హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరగకుండా చూడాలంటూ తెలంగాణ బీజేపీ నేతలు సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు నేతృత్వంలో టీ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ఇవాళ గవర్నర్‍ను కలిశారు. హైదరాబాద్ శివారులో భూముల ధరలు వందల కోట్లు పలుకుతున్నాయని, కోకాపేటలో భూముల ధర ఇటీవల ఎంత పలికిందో మనం చూశామన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం హిల్ట్ పాలసీ పేరుతో 9 వేలకుపైగా ఎకరాలను రియల్ ఎస్టేట్ గా మార్చాలను చూస్తోందని, అతి తక్కువ ధరకే ఈ భూములను రియల్టర్లకు దక్కించబోతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నామని బీజేపీ నేతలు తెలిపారు. ఇక ఈ హిల్ట్ పాలసీలో అవినీతిపై నా ద్గగర ఆధారాలు ఉన్నాయని ఏలేటి మహేశ్వర్ రెడ్డి రెండు రోజుల క్రితం ఆ ఆధారాలను తీసుకుని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ఈ పాలసీలో అవినీతి లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మహేశ్వర్ రెడ్డి చాలెంజ్ సైతం చేశారు.
రేవంత్ కౌంటర్ పై ఉత్కంఠ:
ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తుంటే వీటికి కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది. హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్ల అవినీతి కాదు కదా రూ. 50 వేల అవినీతి కూడా ఆస్కారం లేదని ఈ పాలసీ అంతా పారదర్శకంగా ఉందని కాంగ్రెస్ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది. అయినా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి స్కెచ్‍లు వేస్తున్నారు? వారి నోళ్లను ఏ రకంగా మూయించబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్‍గా మారింది.






