- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Transgenders : రైళ్లల్లో దడ పుట్టిస్తున్న హిజ్రాలు.. వరంగల్ ఘటనే నిదర్శనం
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)కు హిజ్రాల(Transgenders) తలనొప్పి పట్టుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)కు హిజ్రాల(Transgenders) తలనొప్పి పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు రైళ్లల్లో డబ్బులు వసూలు చేస్తూ.. ఇవ్వకపోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. తాజాగా సోమవారం సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వైపు వెళ్తున్న రైల్లో ప్రయాణికులను బెదిరించి, బూతులు తిడుతూ డబ్బులు వసూలు చేశారని, ఓ ప్రయాణికుడిని కొట్టి అతని వద్ద ఉన్న రూ.10 లాక్కున్నారని సికింద్రాబాద్ రైల్వే పోలీస్(GRP)లకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని నేడు వరంగల్ లో అరెస్ట్ చేశారు.
వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ కోసం సికింద్రాబాద్ GRP స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన వెనుక ఓ పెద్ద గ్యాంగ్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. రైళ్లలో హిజ్రాల బెడద తప్పించి, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలు అవసరమని మరికొంతమంది సూచిస్తున్నారు.






