Kaushik Reddy: సీఎం రేవంత్‌పై సంచలన కామెంట్స్.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..

by Ramesh Naini |   (  Updated:2025-07-26 06:40:36  IST  )

హీరోయిన్ల ఫోన్‌లను ట్యాప్ చేయిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Kaushik Reddy: సీఎం రేవంత్‌పై సంచలన కామెంట్స్.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: హీరోయిన్ల ఫోన్‌లను ట్యాప్ చేయిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే నిరసనగా ఎన్ఎస్‌యూఐ హైదరాబాద్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ చేరుకున్నారు. ఈ మేరకు తాజాగా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేయిస్తున్నారని, ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో నిన్న కాంగ్రెస్ మహిళ నేత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత ఫిర్యాదు చేశారు. అలాగే రాజేంద్ర నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి శనివారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి పై తాజాగా కేసు నమోదు అయింది.

Read More: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు.. రాజేంద్రనగర్ పీఎస్‌లో నమోదు

Next Story