టీజీపీఎస్సీపై హైకోర్టు తీవ్ర అసహనం.. ధర్మాసనం షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 14:24:46  IST  )

గ్రూప్‌-1 (Group-1) మూల్యాంకనం, ర్యాంకింగ్‌ మెరిట్ లిస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పును వెలువరించిన విషయం విదితమే.

టీజీపీఎస్సీపై హైకోర్టు తీవ్ర అసహనం.. ధర్మాసనం షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్‌-1 (Group-1) మూల్యాంకనం, ర్యాంకింగ్‌ మెరిట్ లిస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పును వెలువరించిన విషయం విదితమే. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌, మార్కుల జాబితాను ఉన్నత ధర్మాసనం రద్దు చేసింది. సంజయ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రీ వాల్యుయేషన్ చేపట్టాలని, 8 నెలల లోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు టీజీపీఎస్సీ (TGPSC)కి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే తీర్పును వెలువరించే నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. టీజీపీఎస్సీలో పారదర్శకత లోపించిందని వ్యాఖ్యానించింది. రెండు సార్లు గ్రూప్-1 పరీక్ష రద్దు అయినా టీజీపీఎస్సీలో మార్పు రాలేదని.. పరీక్ష నిర్వహణలో మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడింది. ఈ పరిణామాలతో నిరుద్యోగులు నష్టపోతున్నారని కోర్టు ఫైర్ అయింది. సొంత నియమాలనే టీజీపీఎస్సీ ఉల్లఘించిందని ధర్మాసనం కామెంట్ చేయడం ప్రస్తుతం ప్రభుత్వం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story