- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతల వివాదం.. హైకోర్టు సంచలన తీర్పు
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మించిన ఇళ్ల కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మించిన ఇళ్ల కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సీసీఎల్‌ఏ (CCLA) జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన 23 పిటిషన్లపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వెలుగుమట్ల భూముల్లో జరుగుతున్న కూల్చివేతలను అడ్డుకోవాలని, స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే, ప్రస్తుతం అక్కడ అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
311 పట్టాల మంజూరు..
ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించిన గవర్నమెంట్ ప్లీడర్ (GP) మురళీధర్ రెడ్డి.. వెలుగుమట్ల ప్రాంతంలో ప్రభుత్వం ఇప్పటికే పారదర్శకంగా సర్వే నిర్వహించిందని తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి ఇప్పటికే 311 మందికి పట్టాలను మంజూరు చేసినట్లు ఆయన కోర్టుకు వివరించారు. అర్హులకు న్యాయం జరుగుతున్న వేళ కూల్చివేతలపై స్టే ఇవ్వడం సరికాదని వాదించారు. ఇదిలా ఉంటే.. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ గతంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రభుత్వం అక్కడ అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండటంతో, కోర్టు ప్రభుత్వ నిర్ణయానికే మొగ్గు చూపింది. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.






